సెంట్రల్‌ విస్తా ప్రాజెక్టా ? ప్రజల ప్రాణాలా ? ప్రధానికి తన ఇగోయే ముఖ్యమన్న రాహుల్‌

National

oi-Syed Ahmed

|

దేశవ్యాప్తంగా కరోనా కేసుల కల్లోలం రేపుతున్న వేళ కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌గాంధీ ఇవాళ మరోసారి విరుచుకుపడ్డారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యాల్ని గుర్తుచేసేలా రాహుల్‌ చేసిన ట్వీట్‌ సంచలనం రేపుతోంది. ఇందులో ఆయన ప్రధాని మోడీ ఇగో గురించి కూడా ప్రస్తావించారు.

కేంద్రం ఢిల్లీలో రూ.13450 కోట్లతో పార్లమెంటు భవనం సెంట్రల్‌ విస్తా ప్రాజెక్టు నిర్మిస్తోంది. దీనికి పెట్టే ఖర్చును ప్రజల కోసం పెట్టొచ్చుగా అంటూ రాహుల్‌ కేంద్రానికి చురకలు అంటించారు. సెంట్రల్‌ విస్తా ప్రాజెక్టా లేక 45 కోట్ల మంది భారతీయులకు పూర్తిగా వ్యాక్సిన్‌ వేయడమా లేక కోటి ఆక్సిజన్‌ సిలెండర్లు కొనుగోలు చేయడమా లేక రెండు కోట్ల కుటుంబాలకు న్యాయ్‌పథకం కింద రూ.6వేలు ఇవ్వడమా తేల్చుకోవాలని ప్రధాని మోడీకి రాహుల్‌ సూచించారు.

₹13450 crores for Central Vista or to give 2 crore families NYAY of ₹6000: Rahul

ఈ ట్వీట్‌లోనే రాహుల్‌ గాంధీ..ప్రజల ప్రాణాల కంటే ప్రధాని ఇగో పెద్దదిగా కనిపిస్తోందని ఆక్షేపించారు. కరోనా సెకండ్‌ వేవ్ నేపథ్యంలో ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్న మోడీ సర్కార్‌కు రాహుల్‌ వ్యాఖ్యలు శరాఘాతంగా మారాయి. ఇప్పటికే కేసుల నియంత్రణలో విఫలమైన కేంద్రం..అటు వ్యాక్సినేషన్‌ కూడా చేయించలేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనంతటికీ ప్రధాని మోడీ ఇగోయే కారణమన్నట్లుగా రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

Source | Oneindia.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *